MHBD: ఆషాడ మాసం సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలోని ఓ కాలనీలో ఆదివారం మహిళలు గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోరింటాకు చెట్టు వద్ద ఆకులు కోసి నూరుకున్న మహిళలు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఆటపాటలతో వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటూ సంప్రదాయాన్ని చాటారు. ఈ వేడుకలో చిన్నారుల నుంచి పెద్దల వరకు పాల్గొన్నారు.
వార్తలు
బయ్యారంలో ఆషాడ గోరింటాకు వేడుకలు


