భారత్ రక్షణ పరికరాలు, సాంకేతికతపై ప్రపంచానికి విశ్వాసం పెరుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 'ఇటీవల INS మహేంద్రగిరి నావికాదళంలో చేరింది. ఆధునిక యుద్ధనౌకను దేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. యుద్ధనౌకలో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. 'ఆత్మ నిర్భర్ భారత్' శక్తికి ప్రతీక. భారత్ నిరంతరం కొత్త శిఖరాలను తాకుతోంది' అని మోదీ వెల్లడించారు.
వార్తలు
భారత్ నిరంతరం కొత్త శిఖరాలను తాకుతోంది: మోదీ


