NLR: కందుకూరు(M), రెవెన్యూ కాలనీల్లో రేబిస్ లక్షణాలు కనిపిస్తున్న కుక్కలు సంచరిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దవడ, గొంతు బిగుసుకుపోవడం,కాళ్లు బలహీనపడడం వంటి లక్షణాలతో కొన్ని కుక్కలు తిరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు.
వార్తలు
రేబిస్ లక్షణాలతో కుక్కల సంచారం


