TG: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక స్మారకం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అమరవీరులకు నివాళులర్పించారు. భారత సైన్యం ధైర్యపరాక్రమాలకు కార్గిల్ విజయం ప్రతీక అని కొనియాడారు. మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలు ప్రతి భారతీయుడిలో, ముఖ్యంగా యువతలో తరతరాల పాటు దేశభక్తిని నింపుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
వార్తలు
అమరవీరులకు రామచందర్ రావు నివాళులు


