W.G: ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 396 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులో క్షీరపురి దస్తావేజు లేఖర్ల సంఘం చేపట్టిన 'పెన్ డౌన్' 7వ రోజుకు చేరింది. ఆదివారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టి నినాదాలు చేశారు. జీవో 396 వల్ల తాము జీవనోపాధి కోల్పోతామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోను రద్దు చేసి లేఖర్ల వ్యవస్థను కొనసాగించాలన్నారు.
వార్తలు
7వ రోజుకి చేరిన లేఖర్ల 'పెన్‌డౌన్' నిరసన


