హైదరాబాద్: 28°C
వార్తలు

'భారత్ ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తోంది'

భారత్ ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తోందని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే, పాకిస్తాన్ మాత్రం చొరబాటుకు కొత్త మార్గాలను వెతుకుతోందని విమర్శించారు. 'భారత్ యుద్ధనౌకలను రూపకల్పన చేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి రూపకల్పన చేయడంలో నిమగ్నమై ఉంది. భారత్ స్టార్టప్ వ్యవస్థను సృష్టిస్తుంటే, పాకిస్తాన్ ఉగ్రవాద వ్యవస్థను సృష్టిస్తోంది' అని విమర్శలు గుప్పించారు.