హైదరాబాద్: 28°C
వార్తలు

మీరు అందుకుంటారా అవార్డ్..?

NLR: కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ అందించే టెన్జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. భూమి, నీరు, గాలి విభాగాల్లో విశేష సాహసాలు చేసినవారికి, సాహస రంగంలో విశిష్ట సేవలందించిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. అవార్డు గ్రహీతలకు కాంస్య విగ్రహం, బ్లేజర్తో పాటు రూ.15 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.