హైదరాబాద్: 28°C
వార్తలు

మహారాష్ట్రలో మళ్లీ మావోయిస్టుల కదలికలు

మహారాష్ట్రలో మళ్లీ మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. గడ్చిరోలిలోని భామ్రాగఢ్‌లో తాజాగా మావోయిస్టు పోస్టర్లు ప్రత్యక్షం అయ్యాయి. నీరు, అటవీ, భూ సమస్యలపై నిరసనగా ఈ పోస్టర్లను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 30 వరకు గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రజలకు, వ్యాపారులకు పిలుపునిచ్చారు.