హైదరాబాద్: 28°C
వార్తలు

పులి సంచారం.. విద్యుత్ స్తంభం ఎక్కిన సిబ్బంది

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. ఫూల్జరీ గ్రామంలో విద్యుత్ సిబ్బందికి పులి కనిపించింది. దీంతో విద్యుత్ స్తంభం ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు, గ్రామస్తులు రాత్రి సమయాల్లో పొలాల వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.