NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నాటికి 30.160 TMCలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 241 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 1500 క్యూసెక్కులు, కావలి కెనాల్ కు 950 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
వార్తలు
సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు


