హైదరాబాద్: 28°C
వార్తలు

తాళిపేరు నీటి మళ్లింపుపై రైతు సంఘం ఆందోళన

BDK: చర్ల మండలం తాళిపేరు ప్రాజెక్టు నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించడం వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ రైతు సంఘం ఆరోపించింది. చర్ల మండలంలో కాలువలను పరిశీలించిన సంఘం నాయకులు, ప్రాజెక్టు కాలువల మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.