హైదరాబాద్: 28°C
వార్తలు

'నలుగురు అమ్మాయిల మిస్సింగ్'

SRD: ఇస్నాపూర్‌లో నలుగురు విద్యార్థినులు అదృశ్యమవడంతో కలకలం రేగింది. ఈనెల 23 ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని ఇంటి నుంచి వెళ్లిన బిహార్‌కు చెందిన అమ్మాయిలు సాయంత్రం ఇంటికి రాలేదు. పాఠశాలకు కూడా హాజరు కాలేదని తెలియడంతో తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. ఆచూకీ లభించకపోవడంతో ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు