GDWL: మానవపాడు మండలం అమరవాయిలో కాటమయ్య (శ్రీ మాధవస్వామి) ఉత్సవాన్ని గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ ఎద్దుల బండ్లపై స్వామివారిని ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. డీసీసీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ సిరాజ్ పూజల్లో పాల్గొన్నారు. సర్పంచ్ హుసేన్, రైతు సంఘం అధ్యక్షుడు హుసేన్ పీర్ తదితరులు హాజరయ్యారు.
వార్తలు
అమరవాయిలో ఘనంగా కాటమయ్య ఉత్సవం


