హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు: IMD

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఇవాళ గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, AP, మధ్యప్రదేశ్, గంగానది పరివాహక ప.బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.