హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరు జిల్లాల్లో వరదలు బీభత్సం

అసోంలోని ఆరు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చరాయిదేవ్, దిబ్రూగఢ్, గోలాఘాట్, జోర్హాట్, శివసాగర్, నాగావ్ జిల్లాల్లో వరదలు తగ్గడం లేదు. దాదాపు 6.55 లక్షల మంది వరద ముంపులోనే ఉన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరు జిల్లాల్లో 274 సహాయక శిబిరాలు, ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.