హైదరాబాద్: 28°C
వార్తలు

తెనాలి మార్కెట్ యార్డులో కఠిన ఆంక్షలు!

GNTR: తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని ఓపెన్ గ్రౌండ్‌ను అధికారులు తవ్వడంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేసి, ఇతరుల ప్రవేశాన్ని నిషేధించారు. మద్యం సేవించి బెట్టింగ్‌లు, ఘర్షణలు జరుగుతున్నాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పిల్లలు ఆడుకునే గ్రౌండ్‌ను తవ్వి గుంటలు పెట్టడం, ఆంక్షలు విధించడం సరైంది కాదంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.