హైదరాబాద్: 28°C
వార్తలు

కాజాలో 4వ శతాబ్దం నాటి వినాయక విగ్రహాలు

GNTR: మంగళగిరి(M) కాజాలో పొలం దున్నుతుండగా 4వ శతాబ్దానికి చెందిన రెండు వినాయక విగ్రహాలు లభ్యమయ్యాయి. ఎర్ర ఇసుకరాతితో తయారైన ఇవి ఆనంద గోత్రిక కాలం నాటివని అంచనా వేస్తున్నారు. అక్కడే శాతవాహన, ఇక్ష్వాకు, ఆనంద గోత్రిక కాలం నాటి కుండల పెంకులను పురావస్తు నిపుణులు కనుగొన్నారు. తాజా ఆనవాళ్లతో అమరావతి చారిత్రక వైభవం మరోసారి వెలుగులోకి వచ్చినట్లయింది.