హైదరాబాద్: 28°C
వార్తలు

వరదలు బీభత్సం.. 61కి చేరిన మృతుల సంఖ్య

అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో తాజాగా మరో 15 మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 61కి చేరింది. వందలాది మంది ఆచూకీ గల్లంతయ్యింది. బ్రహ్మపుత్ర నదితో పాటు దాని ఉపనదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. మరోవైపు గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.