HNK: వేలేరు మండల కేంద్రంలో తమ వ్యవసాయ బావి వద్ద నిల్వ ఉంచిన పశువుల మేత గడ్డిని దహనం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ రైతు సూత్రపు తిరుపతి శనివారం పశువులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని, మేత లేక పశువులు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
పశువులతో పోలీస్ స్టేషన్ ఎదుట రైతు నిరసన


