హైదరాబాద్: 28°C
వార్తలు

బురదమయంగా రహదారి.. ఇబ్బందుల్లో వాహనదారులు

ADB: బజార్‌హత్నూర్ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డెడ్రా, మన్కాపూర్, గిర్జయి, గోశాయి ఉమార్డ్ గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా బురదమయమయ్యాయి. వాహనాలు ఇరుక్కుపోతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పాఠశాల విద్యార్థులు, అత్యవసర పనులపై వెళ్లే బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరారు.