హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్లాస్టిక్‌పై మెరుపుదాడులు.. 98 కిలోలు సీజ్

WGL: వర్ధన్నపేట పట్టణంలో పలువ్యాపార సంస్థలపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మున్సిపాలిటీ, పోలీసుల సహకారంతో శనివారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 98 కిలోల నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.రూ. 12,500 జరిమానా విధించారు. తనిఖీల సందర్భంగా ఓకిరాణా దుకాణం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకోగా, పోలీసులు జోక్యంతో అదుపులోకి వచ్చింది.