హైదరాబాద్: 28°C
వార్తలు

చిన్నారిపై హత్యాయత్నం.. నిందితుడు రిమాండ్

JN: కొడకండ్ల మండల కేంద్రంలో చిన్నారిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి సమీపంలోని నీటి సంపులో చిన్నారిని పడవేసి మూతపెట్టిన ఘటనలో తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో వ్యక్తిగత కక్షతో ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.