GNTR: గుంటూరు బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా కూచిపూడి, జానపద నృత్యాలు విశేషంగా అలరించాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య జ్యోతిప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాధామాధవ నాట్య కళాక్షేత్రానికి చెందిన నాట్యాచార్య ఖలీల్ శిష్యబృందం అద్భుత ప్రదర్శనలు ఇవ్వగా, నిర్వాహకులు ఖలీల్‌ను ఘనంగా సత్కరించారు.
వార్తలు
గుంటూరులో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యం


