హైదరాబాద్: 28°C
వార్తలు

మళ్లీ భారత్-నేపాల్ సరిహద్దు వివాదం!

భారత్, నేపాల్ దేశాల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. లింపియాధుర, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలను తమ భూభాగంగా చూపే కొత్త మ్యాప్‌ను నాణేలపై ముద్రించేందుకు నేపాల్ సిద్ధమైంది. అయితే, చారిత్రాత్మకంగా ఇవి ఉత్తరాఖండ్‌లో భాగమని భారత్ గతంలోనే స్పష్టం చేసింది. ఏకపక్ష నిర్ణయాలతో కాకుండా చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్ సూచిస్తోంది.