హైదరాబాద్: 28°C
వార్తలు

నెక్లెస్ రోడ్‌లో భారీ ట్రాఫిక్ జామ్

TG: ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అదే సమయంలో పీపుల్స్ ప్లాజాలో క్రాకర్స్ షో జరిగింది. అలాగే, వీకెండ్ కూడా కావడంతో నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.