హైదరాబాద్: 28°C
వార్తలు

యువతకు అవకాశం ఇవ్వాలి: అనిరుద్ రెడ్డి

TG: చదువుకున్న యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత మంత్రుల రెండేళ్ల కాలం పూర్తయిందని, తమలాంటి చదువుకున్న యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని అన్నారు. ప్రజల ఆకాంక్ష కూడా ఇదేనన్నారు. అయితే మంత్రి పదవులపై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.