TG: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని ఎంపీ చామల కిరణ్ రెడ్డి అన్నారు. విద్యార్థులు, రాహుల్ గాంధీ పోరాటం వల్లే కేంద్రం దిగివచ్చిందన్నారు. రాజీనామాతో సమస్య తీరదని, పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. జాతీయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
పోరాటంతోనే కేంద్రం దిగివచ్చింది: చామల


