హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయులందరూ గర్వించదగ్గ క్షణం: మోదీ

సారనాథ్‌కు యునెస్కో గుర్తింపు లభించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారతీయులందరూ గర్వించదగ్గ క్షణమన్నారు. గౌతమ బుద్ధుడి బోధనలతో ముడిపడిన ఈ క్షేత్రం మన దేశ ఆధ్యాత్మిక, నాగరికతా వారసత్వాన్ని ప్రపంచానికి చాటుతుందన్నారు. ప్రజలను బుద్ధుని ఆదర్శాల వైపు ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు.