హైదరాబాద్: 28°C
వార్తలు

సారనాథ్‌కు యునెస్కో గుర్తింపు

యూపీలోని పురాతన బౌద్ధ క్షేత్రం బుద్ధ భగవానుడు తొలిసారిగా సందేశాన్ని వెలువరించిన సారనాథ్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరుగుతున్న యునెస్కో 48వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో చారిత్రక క్షేత్రాన్ని ఈ జాబితాలో చేర్చారు. సారనాథ్ సహా ఇప్పటివరకు దేశంలో 45 నిర్మాణాలకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లుగా గుర్తింపు ఉన్నాయి.