ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో శనివారం పెదకండ్లకుంట, అయ్యప్ప రాజుపాలెం,నరసరాజుపాలెం గ్రామాలకు చెందిన రైతులు 1117 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా 772 బేళ్లు కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 345 బేళ్లు తిరస్కరించారు. గరిష్ఠ దర కేజీ రూ.250 కాగా కనిష్ఠ ధర రూ.60లకు కొనుగోలు చేశారు. తిరస్కరణల సంఖ్య మాత్రం ఆగట్లేదని రైతులు వాపోతున్నారు.
వార్తలు
పొగాకు వేలం కేంద్రంలో బేళ్లు తిరస్కరణ


