హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ జిల్లా కార్యవర్గంలో బుచ్చాల నాగరాజు గౌడ్‌కు స్థానం

NLG: నల్గొండ మండలం కొత్తపల్లికి చెందిన బుచ్చాల నాగరాజు గౌడ్‌ను పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసిన నాగరాజు గౌడ్, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.