హైదరాబాద్: 28°C
వార్తలు

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన

HNK: ఆత్మకూరు మండల కేంద్రంలో పునర్నిర్మాణం చేయనున్న తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, అందుబాటులో ఉన్న స్థలం, అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. అన్ని మౌలిక సదుపాయాలతో ఆధునిక కార్యాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు.