హైదరాబాద్: 28°C
వార్తలు

స్మశానవాటికను సందర్శించిన సీపీఎం నేతలు

HNK: కాజీపేట (మం) దర్గా కాజీపేట శివారులోని హిందూ స్మశానవాటికను శనివారం సీపీఎం పార్టీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి పోరుగంటి సాంబయ్య మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి కనీస వసతులతో కూడిన స్మశాన వాటికను నిర్మించాలని డిమాండ్ చేశారు.