హైదరాబాద్: 28°C
వార్తలు

'చట్టాలపై అవగాహనతోనే నేరాల నివారణ'

BHPL: విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందితే ర్యాగింగ్, పోక్సో వంటి నేరాలను నివారించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జే. జీవన్ కుమార్ అన్నారు. భూపాలపల్లి పట్టణ కేంద్రంలో శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు.