హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ మహిళా నాయకురాలు అకస్మాత్తుగా మృతి

NDL: చాగలమర్రి మండల కేంద్రానికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలు సరస్వతమ్మ శనివారం అకస్మాత్తుగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ చాగలమర్రి గ్రామానికి చేరుకుని సరస్వతమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.