హైదరాబాద్: 28°C
వార్తలు

యువతకు 'లక్ష్యం ఉపాధి సెల్'

ASR: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 'లక్ష్యం-జిల్లా ఉపాధి సెల్' ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. కలెక్టరేట్ కేంద్రంగా పనిచేసే ఈ సెల్ ద్వారా యువత నమోదు చేసుకుని, ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని పొందవచ్చన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణతో పాటు, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.