BDK: అశ్వాపురం మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, సీతారామ ప్రాజెక్టు జలాలను తుమ్మల చెరువుకు మళ్లించాలని మాజీ ఎంపీపీ మల్లారెడ్డి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు ఆలస్యం అవుతుండడంతో సాగు నీళ్లు లేక ఈ ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
సాగు నీళ్లు లేక రైతుల ఆందోళన


