హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ విజయం విద్యార్థులందరిది: సీజేపీ

ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం విద్యార్థులందరిది అని సీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారన్నారు. రాజీనామా డిమాండ్ నెరవేరిందని.. మిగతా రెండు డిమాండ్లు నేరవేరే వరకు వేచి ఉంటామని వెల్లడించారు.