హైదరాబాద్: 28°C
వార్తలు

బుడగ జంగాలను ఎస్సీగా గుర్తించాలి

KRNL: బుడగ జంగాల కులస్తులను ఎస్సీలుగా గుర్తించాలని సంఘం నాయకులు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మకు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ హోదా లేక తమ పిల్లలను ఉన్నత విద్య చదివించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కులాన్ని ఎస్సీలుగా గుర్తించి విద్యా, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.