హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ప్రకాశం: చీమకుర్తి మండలం రామతీర్థం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని గ్రానైడ్ లారీ కింద ఓ ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు పడి అక్కడికక్కడే మృతి చెందారు. చీమకుర్తి సీఐ ప్రసాద్ అక్కడికి చేరుకొని జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. మృతులో వివరాలు తెలియవలసి ఉందని చెప్పారు.