కుండపోత వర్షాలకు గుజరాత్‌లోని ప్రధాన నగరం అహ్మదాబాద్ జలమయమైంది. అక్కడి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు చేరి, రన్‌వేపై నిలిచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న ఉదయానికి 24 గంటల్లో ఏకంగా 44 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వాతావరణ శాఖ ఇవాళ కూడా నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది.
వార్తలు
నీటమునిగిన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్


