హైదరాబాద్: 28°C
వార్తలు

జంతర్‌మంతర్‌లో ఇన్ఫెక్షన్ల కలకలం

ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న నిరసనకారుల ఆరోగ్యం క్షీణిస్తోంది. తీవ్రమైన ఎండ, ఉక్కపోత, వర్షం, రద్దీతో కూడిన వాతావరణంలో ఆందోళన కొనసాగిస్తుండటంతో పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జ్వరం, గొంతు నొప్పి, గాయాలతో వైద్యులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వాలంటీర్ వైద్యులు వెల్లడించారు.