హైదరాబాద్: 28°C
వార్తలు

లైంగిక వేధింపులు.. చితకబాదిన యువతి

బెంగళూరులో ఓ ఆకతాయి చేసిన పనికి యువతి ధీటుగా బదులిచ్చింది. హెబ్బల్ నుంచి మాన్యతాకు వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి యువతిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె అతడిని చితకబాదుతూ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పింది. వెంటనే అతను బస్సును ఆపేసి ఆకతాయికి తగిన బుద్ధి చెప్పాడు. అనంతరం పోలీసులకు అప్పగించారు.