హైదరాబాద్: 28°C
వార్తలు

శాప్‌పై ఏపీ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు

AP: ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఈ నిర్ణయం 2022 JAN 1 నుంచే వర్తింపజేస్తుండటంతో ఇటీవల 60 ఏళ్లకు ఉద్యోగ విరమణ చేసిన 8 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు శాప్ ప్రకటించింది. అయితే, వారు ఉద్యోగంలో లేని కాలానికి ఎలాంటి జీతభత్యాలు చెల్లించరు.