హైదరాబాద్: 28°C
వార్తలు

ఆత్మహత్యాయత్నం అడ్డుకున్న పోలీసులు

KNR: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వివాహిత మానసను పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. దుర్షేడుకు చెందిన ఆమె యత్నాన్ని ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆదేశాలతో బ్లూకోల్ట్స్ సిబ్బంది అఫ్జల్, ప్రసాద్ అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.