హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్కతుర్తి వడ్డెర సంఘం అధ్యక్షుడిగా ఎల్లయ్య

HNK: ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో వడ్డెర సంఘం మండల అధ్యక్షుడిగా గొల్లన ఎల్లయ్యను ఇవాళ ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు సంధ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ సభ్యుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని ఎల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం సభ్యులు పాల్గొన్నారు.