హైదరాబాద్: 28°C
వార్తలు

పోస్టాఫీస్ వద్ద బారులు తీరిన ప్రజలు..!

NTR: తల్లికి వందనం' నగదు జమపై స్పష్టత లేక తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శనివారం విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌ పోస్టాఫీసు వద్ద వందలాది మంది బారులు తీరారు. ఖాతాలు తనిఖీ చేసుకునేందుకు ఉదయం నుంచే క్యూలైన్లలో పడిన పాట్లు వర్ణనాతీతంగా మారాయి. సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్న లబ్ధిదారులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.