హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులను కేంద్రం వేధిస్తుంది: రాహుల్‌ గాంధీ

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను కేంద్రం వేధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. హక్కుల కోసం పోరాడుతోన్న విద్యార్థులపై కేంద్రం క్రూరమైన చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. వ్యవస్థలోని లోపాలను విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థులు కోరుతున్నారని రాహుల్ పేర్కొన్నారు.