హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

MDK: ప్రమాదాల్లో మరణించిన నిరుపేద కుటుంబాలను ఆదుకుంటామని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు. పాపన్నపేట మండల పరిధిలో విద్యుదాఘాతంతో ఎర్ర కిష్టయ్య, రోడ్డు ప్రమాదంలో రషీద్, రాములు మృతిచెందగా... ఆయా కుటుంబాలను ఆయన పరామర్శించి నివాళులర్పించారు. గాయపడిన గౌసు ఆరోగ్యంపై ఆరా తీశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన వెంట ఉన్నారు.