KNR: హుజూరాబాద్ మండలంలోని సింగాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు స్వామివారికి అభిషేకాలు, విశేష అలంకరణలు నిర్వహించి ప్రత్యేక ఆరాధనలు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వార్తలు
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు


